కోల్‌కతా, నవంబర్ 2: బెంగాల్‌లో అయిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ప్రాణాలు తీసిన ఓ నిందితుడిని ప్రజలు చావగొట్టారు. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. అలీపుర్‌దు హార్ జిల్లాకు చెందిన మోనారాయ్ (40) ఐదేళ్ల చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. భక్తరాయ్ అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని చూశాడు. అయితే మోనా రాయ్‌ను అడ్డుకోకపోగా అతను కూడా దారుణానికి ఒడిగట్టాడు.
అనంతరం ఇద్ద రూ కలిసి పాప మృతదేశాన్ని చెరువులో పడేశారు. చీకటి పడుతున్నా పాప కనబడకపోవడంతో తల్లిదండ్రులు స్థానికులను విచారించారు. ఈ నేపథ్యంలోనే పాప మృతదేహం చెరువులో లభ్యమైంది. పాపను చివరగా మోనా రాయ్‌తో చూశామని కొంద రు చెప్పడంతో అతడ్ని బంధించి ఇంట్లో పరిశీలించారు.
బెడ్‌పై రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు మోనారాయ్‌ని చెట్టుకు కట్టేసి కొట్టా రు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తరాయ్ పోలీసుల ఎదుట లొంగిపో యి నేరాన్ని అంగీకరించాడు. బీజేపీ ఎంపీ మనోజ్ టిగ్గా స్పందిస్తూ ఈ ఘటన ద్వారా బెంగాల్ సురక్షితమైన ప్రదేశం కాదనిఅర్థమవుతుందన్నారు.