calender_icon.png 5 January, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె బాట పట్టిన జనం

12-10-2024 12:00:00 AM

దసరాకు ప్రయాణికుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక సర్వీసులు

సిటీ నుంచే 1,756 బస్సులు 

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): దసరా పండుగను పురస్కరించుకుని పట్నం పల్లె బాట పట్టింది. సొంతూళ్లకు వెళ్లే వారితో శుక్రవారం నగరంలోని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. పండుగ సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం 6 వేల ప్రత్యేక బస్సులను కేటా యించింది.

అందుకు గ్రేటర్ పరిధిలోని 1,756 బస్సులను సైతం కేటాయించాల్సి వచ్చింది. ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు ఎల్‌బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, ఐఎస్ సదన్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.

2వ తేదీ నుంచి స్కూళ్లకు, 6వ తేదీ నుంచి కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో  విద్యార్థులు పల్లెలకు వెళ్లారు. ఉద్యోగులు, వ్యాపారులు వెళ్లడంతో కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీ నగర్ తదితర ప్రధాన రహదారులన్నీ  నిర్మానుష్యంగా మారాయి.