మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల గొంతుక విజయక్రాంతి దినపత్రిక అని ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో విజయక్రాంతి దినపత్రిక 2025 ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్యాలెండర్‌ను విజయక్రాంతి సీఈవో రాహు ల్ దేవల్లతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా విజయక్రాంతి ప నిచేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, వివరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా విజయక్రాంతి కరీంనగర్ ఉమ్మడి జిల్లా యూనిట్‌ను అభినందించారు.
కార్యక్రమం లో విజయక్రాంతి స్టాఫ్ రిపోర్టర్ బీ విజయసింహారావు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా రిపోర్టులు మల్లేశంయాదవ్, శ్రీనివాస్, సిటీ రిపోర్టర్ జగన్నాథరెడ్డి, సర్క్యులేషన్ మేనేజ ర్ మంచాల రాజు, అడ్వర్టుజ్‌మెంట్ మేనేజర్ బరిగెల ఆంజనేయులు పాల్గొన్నారు.