08-02-2025 11:17:28 PM
దౌల్తాబాద్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం లిక్కర్ స్కాం అవినీతి, అక్రమాలకు వాత పెట్టి ఢిల్లీ ప్రజలు బిజెపి పార్టీకి పట్టం కట్టారని దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షురాలు దేవుడి లావణ్య అన్నారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి పార్టీ విజయ ఢంకా మోగించిన సందర్భంగా దౌల్తాబాద్ మండల కేంద్రమైన శివాజీ చౌరస్తాలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతుందని కొనియాడారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలమంతా ఐక్యమత్యంతో కలిసి పనిచేస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు పోతురాజు కిషన్, కుమ్మరి నర్సింలు, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, రమేష్, గడ్డమీది స్వామి, గణేష్, తదితరులు పాల్గొన్నారు....