calender_icon.png 31 October, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల పెన్షన్‌ను పెంచాలి

04-07-2024 02:37:53 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై3(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.9 వేలకు పెంచాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం రూ. మూడు వందల నుంచి రూ.మూడు వేల కు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం రూ.ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ పెంపు కోసం 44,49,767 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షుడు జాకీర్, సప్తగిరి, సహా య కార్యదర్శులు లక్ష్మి, రాజు, పాలక్‌రావు, కళ్యాణ్, అంకన్న పాల్గొన్నారు.