సుప్రీంకోర్టు ఆశ్చర్యం
న్యూఢిల్లీ, నవంబర్ 8: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పింఛన్ చెల్లించడంపై సుప్రీ ంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తక్కు వ పింఛన్ విషయమై ఓ హైకోర్టు రిటైర్డ్ జడ్జి న్యాయమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 13 ఏండ్లు జిల్లాకోర్టులో జ్యుడీషియల్ అధికారిగా పనిచే సిన తర్వాత అలహాబాద్ హైకోర్టు జడ్జీగా ప్రమోషన్ పొందిన తనకు రూ.15 వేల పింఛన్ వస్తున్నట్లు ఆ పిటషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంత తక్కువ పింఛన్ పొందుతున్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఉన్నారంటే దిగ్భ్రాంతికరమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం కేసును నవంబర్ 27కి వాయిదా వేశారు.