21-02-2025 08:06:53 PM
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానిచంద్ర...
సంగారెడ్డి (విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించే కేసులను కక్షదారులు రాజీమార్గంలో పరిష్కారం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానిచంద్ర తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మార్చి 8వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజీ చేయదగ్గ పోలీస్ కేసులు, భార్యాభర్తల కేసులు, చిన్నచిన్న వివాదాలు, ఎక్సైజ్ కేసులు, బ్యాంక్ కేసులు తదితర కేసులు రాజీ చేయదగ్గ కేసులలో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవచ్చు అన్నారు.
క్షణికావేశంలో ఇరువర్గాలు చిన్న చిన్న తగాదాలు పడి కేసులు నమోదు జరిగి కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టులో తమ తమపై ఉన్నటువంటి కేసులను రాజీచేసుకుని సామరస్యంగా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి అన్నారు. న్యాయవాదులు సహకారం లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలన్నారు. కక్షిదారులకు పెద్ద మొత్తం లో నష్టపరిహారం వచ్చేలా కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి కె. జయంతి, 2వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి డా.పి.పి.కృష్ణార్జున్, మూడవ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి జి.సునీత, 4వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి లావణ్య, సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధా కృష్ణ చౌహన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.అనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.ధన లక్ష్మీ, అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంజీవరావు, పోలీస్ అధికారులు, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ మణెమ్మ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.