- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- కురుక్షేత్రలో సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞం
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): హర్యానాలోని కురుక్షేత్ర పంజాబీ ధర్మశాలలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్వహించిన సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత పారాయణ యజ్ఞం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరవగా..
12 దేశాలకు చెందిన ఎన్నారై విద్యార్థులు, 50 దేశాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు. భగవద్గీత పఠనం అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. భగవద్గీత బోధనలు సమానత్వం, శాంతికి మార్గం అని అన్నారు. గీత సమానత్వం, శాంతికి మార్గాన్ని అందించిందన్నారు.