calender_icon.png 20 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల మార్గం నేటి తరానికి ఆదర్శం

11-04-2025 12:00:00 AM

  1. వారి మార్గాన్ని అనుసరించేందుకు కృషి చేయాలి

శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

ఓయూలో ఘనంగా మహాత్మాజ్యోతిరావుపూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10(విజయక్రాంతి) : మహనీయులు (మహాత్మా జ్యోతిరావుపూలే, డా.బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్) చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఉస్మానియా యూనివ ర్సిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలు గు రోజుల పాటు ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మహనీయుల జయంతి ఉత్సవాలకు స్పీకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఓయూ వీసీ ప్రొ.కుమార్‌మొలుగారం, రాష్ట్ర గ్రంథాల సంస్థ ఛైర్మన్ డా.రియాజ్‌లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మాజ్యోతిరావుపూలే, డా.బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌లు దేశంలోని అసమాన తలు, అస్పృష్యత, కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడి దేశ చరిత్రనే మార్చారని కొనియాడారు. మహనీయుల జయంతి సందర్భంగా వారు చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనలో తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోందని తెలిపారు. మహనీయుల చరిత్రను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమాన్ని నిర్వ హించడం అభినందనీయమని, అందుకోసం ఓయూ వీసీ ప్రొ.కుమార్ తీసుకుంటున్న చొరవను అభింనందించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డా.రియాజ్ మాట్లాడుతూ భారత చారిత్రక వాస్తవాలను వివరిస్తూ మహనీయుల స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునే విధంగా యువత యోచించాల పిలుపునిచ్చారు. వీసీ ప్రొ. కుమార్ మొలుగారం మాట్లాడుతూ దేశం లో విద్య, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శమన్నారు.

అణ చివేతకు వ్యతిరేకంగా, శ్రామికుల హక్కుల కోసం జగ్జీవన్‌రామ్, సమాన హక్కుల కోసం డా.బీఆర్.అంబేడ్కర్, పోరాడారని, కొనియాడారు. కార్యక్రమంలో అట్టడుగు వర్గాల సాధికారత, వర్తమానం, భవిష్యత్తు, అవకాశాలు అనే అంశంపై ప్రొ.ఇ.సుధారాణి  మాట్లాడారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. జి.నరేష్‌రెడ్డి, ఓఎస్డీ జితేంద్రనాయక్, ప్రొ.లావణ్య, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.