పారిశ్రామికవాడలో కోరలు చాచిన కాలుష్యం
జల, వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- గుంతల ద్వారా భూమిలో ఇంకుతున్న రసాయనిక వ్యర్థాలు
- ప్రజల ఫిర్యాదులను పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడ కాలుష్యం కోరల్లో చిక్కిపోయింది. పారిశ్రామికవాడలో ఫార్మా కంపెనీలు, కెమికల్, స్టీల్, ఆహారపదార్థాలు తయారుచేసే పరిశ్రమలు, మోటార్ వాహనాల పాత టైర్లను కాల్చే పరిశ్రమలతో పాటు ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వంటి పరిశ్రమలేన్నో ఉన్నాయి.
పరిశ్రమల నుంచి వస్తున్న పొగ, రసాయన వ్యర్థాలతో సమీపంలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల నుంచి బయటకు వదులుతున్న పొగ నల్లని మేఘాలను తలపిస్తుంది. దీంతో ప్రజలు రోగాల బారినపడుతున్నా రు. ప్రజలను శ్వాసకోశ, చర్మ వ్యాధులతో పాటు పలు రోగాలు పీడిస్తున్నాయి.
కొన్ని పరిశ్రమలు పెద్ద గుంతలు తవ్వి అందులోకి రసాయన వ్యర్థాలు వదులుతున్నా యి. రసాయనాలు భూమిలో ఇంకి భూగ ర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. తాగునీరు రంగు మరుతున్నట్లు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పారిశ్రామికవాడకు సమీపంలో ఉన్న ఇస్నాపూర్ చెరువు రసాయనాలతో నిండిపోయింది.
కొన్ని పరిశ్రమలు యథేచ్ఛగా రసాయనాలను చెరువులోకి వదులుతున్నాయి. దీంతో చెరువు నీరు తాగిన పశువులు సైతం రోగాల బారిన పడుతున్నాయి. ఒక్కప్పుడు వాణిజ్య పంటలు పండిన భూములు రసాయనాలతో నేడు బీడు భూములుగా మారిపోతున్నాయి.
సంగారెడ్డి, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): పాశమైలారం పారిశ్రామికవాడ నుంచి రసాయనాలు భూగర్భంలోకి వదిలివేయడంతో వ్యవసాయ బోరుల్లో కలుష్యత జలా వస్తున్నాయి. పారిశ్రామికవాడకు సమీపంలో ఉన్న ఇస్నాపూర్, పాశమైలారంతో పాటు పలుగ్రామాలు కాలుష్యకోరల్లో చిక్కుకుపోయాయి. రసాయన పరిశ్రమల్లో ఉన్న వ్యర్థాలను చుట్టుపక్కల పారేస్తున్నారు. వ్య భూమి లోపల సుమారు 60 అడుగుల లోపల పూడ్చివేస్తున్నట్లు తెలిసింది.
పరిశ్రమల యాజమాన్యాలు చుట్టు ఉన్నగ్రామాల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండదండలతో పరిశ్రమల నుంచి వ్యర్థాలను బయటకు పడేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ప్రజాప్రతినిధులు, రా నాయకులే ఏజెంట్లుగా మారి పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకర్లు, వాహనాలు ఏర్పాటుచేసి బయ పడేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
రసాయనాలు పడేసిన ప్రాంతంలో పిచ్చి మొక్కలు కుడా మొలవని పరిస్థితి ఉంది. కొన్ని పరిశ్రమలు, పరిశ్రమల చుట్టూ ఉన్న కాలువల ద్వారా రసాయన వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారు. కాలుష్య నియం మండలి అధికారులు ఎవరూ ఇదేమిటని ప్రశ్నించకపోవడంతో పరిశ్రమల యాజమానులు యథేచ్ఛగా బయటకు తీసుకవచ్చి పడేస్తున్నారు.
కాలుష్య నియంత్రణ ఎక్కడ..?
పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. ప్రతి పరిశ్రమను పరిశీలించి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అధికారులు చర్యలు తీసుకో లేదు. ఆ అధికారులు పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరించడంతో కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమవుతున్నారు.
కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్థాలను కాలువల ద్వారా చెరువులోకి వదులుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. కాలుష్యంపై ఫిర్యాదు చేసినా, అధికారులు తనిఖీలు చేయడం లేదు. అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి, కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరో ఉన్నాయి.
పరిశ్రమలు పెద్దగొట్టలు ఏర్పాటు చేసి పొగను బయటకు వదులుతున్నారు. టైర్లు కాల్చే పరిశ్రమ నుంచి భారీగా పొగ బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో టైర్లు కల్చడంతో ఆ పొగ పిల్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చర్యలు లేవు
కాలుష్యం వదులుతున్న పరిశ్రమలపై చర్య తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బతిన్నా అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదు. పారిశ్రామికవాడ చుట్టుపక్కల ఉన్నగ్రామలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అత్యంత ప్రమాదకర కాలు నియంత్రించాలని కాలుష్య నియంత్రణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.
సత్యం, స్థానికుడు, పటాన్‌చెరు
ఇబ్బందులెన్నో..
రసాయన వ్యర్థాలతో పచ్చని పంటలతో కళకళలాడే వ్యవసాయ భూములు బీడు భూములుగా మారుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు కాలుష్యం కాటుకు గురిచేస్తున్నాయి. కాలుష్యంను వదులుతున్న పరిశ్రమల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు.
బాలయ్య, స్థానికుడు, పటాన్‌చెరు