calender_icon.png 29 November, 2024 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫడ్నవీస్‌కు మార్గం సుగమం!

29-11-2024 01:48:02 AM

మొదటి నుంచి మద్దతు తెలుపుతున్న అజిత్ పవార్

బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఏక్‌నాథ్ షిండే

రాజకీయంగానూ బీజేపీకి ఎంతో సానుకూలత

అధికారిక ప్రకటనే తరువాయి

ముంబై, నవంబర్ 28: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ వీడినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే బీజేపీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో వెనక్కి తగ్గినట్లే తెలుస్తోంది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్‌కు మార్గం సుమగమైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ కూడా అత్యధిక సీట్లు సాధించడంలో విశేష కృషి చేసిన ఫడ్నవీస్‌కే పదవి దక్కాలని భావిస్తోంది. పొత్తులో భాగంగా టికెట్ దక్కని బీజేపీ అభ్యర్థులను నియంత్రించి బీజేపీకి ఫడ్నవీస్ బలం చేకూర్చారు. అయితే, మహాయుతి భాగస్వామ్య పక్షాల అధినేతలతో బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ తర్వాతనే సీఎం ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. 

రాజకీయంగానూ బీజేపీకి ప్లస్సే.. 

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 145. శివసేన (షిండే వర్గం) 57, ఎన్సీపీ (అజిత్ పవార్)41 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో శివసేన బెట్టు చేసినా అజిత్ పవార్ వర్గం బీజేపీకే అనుకూలంగా ఉంది. దీంతో ఒకవేళ షిండేకు పదవి దక్కని నేపథ్యంలో కూటమి నుంచి వైదొలిగిన బీజేపీకి, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. మరోవైపు కూటమిని విచ్ఛిన్నం చేసుకోవాలని బీజేపీ కూడా చూడటం లేదు.

ఫడ్నవీస్‌ను సీఎం చేసి షిండే, అజిత్‌పవార్‌కు సముచిత స్థానాలు కల్పించాలని భావిస్తోంది. ఇదే విషయంలో ఇద్దరు నేతలు కాంప్రమైజ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే షిండే కూడా బుధవారం మాట్లాడుతూ.. పదవి కోసం కాకుండా బాల్ ఠాక్రే ఆశయాలే తనకు ముఖ్యమని ప్రకటించడం గమనార్హం. దీన్ని బట్టి మహారాష్ట్ర సీఎం పీఠం ఫడ్నవీస్‌కే దక్కుతుందని మెజార్టీ విశ్లేషకుల అభిప్రాయం.

కాంగ్రెస్ 

అతివిశ్వాసంతోనే ఓటమి! 

మహారాష్ట్రలో మహావికాస్ అఘా డీ పరాజయానికి కారణం కాంగ్రెస్ అతి విశ్వాసమే కారణమని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఆరోపించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వ్యవహార తీరును తప్పుబట్టింది. ఉద్ధవ్ వర్గం నేత అం బాదాస్ ధన్వే మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యా నా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఓటమి ఎదురైంది. ఇందు కు కాంగ్రెస్ అతి విశ్వాసమే కారణం. మహారాష్ట్ర ఫలితాల్లోనూ ఇదే ప్రతిబింబించింది. సీట్ల పంపకాల సమయం లోనూ ఆ పార్టీ వైఖరి మమ్మల్ని బాధించింది. ఉద్ధవ్ ఠాక్రేను ముందుగానే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవి. కాంగ్రెస్ తీరుతో ఎంవీఏ అవకాశాలు దెబ్బతిన్నాయి ఆరోపించారు.