calender_icon.png 21 April, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమి నుంచి వెంచర్‌కు దారి

21-04-2025 12:07:08 AM

రోడ్డు వేసిన రియల్టర్లు

తొలగించిన రెవెన్యూ అధికారులు 

దారి లేకున్నా ప్లాట్ల విక్రయాలు 

 గుడ్డిగా లేఅవుట్‌కు అనుమతినిచ్చిన హెచ్‌ఎండిఏ 

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): వెంచర్ కు హెచ్‌ఎండిఏ అనుమతి ఉందంటే కొనుగోలుదారులు అందులో ప్లాట్ కొనడానికి ఇష్టపడతారు. నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉంటేనే హెచ్ ఎం డి ఏ అనుమతిస్తుందని నమ్మకం. కానీ మే డ్చల్ జిల్లాలో ఒక వెంచర్ కు రోడ్డు ఎక్కడి నుంచి ఉందో పరిశీలించకుండా కాసులకు కక్కుర్తి పడి గుడ్డిగా అనుమతినిచ్చారు. హెచ్‌ఎండిఏ అనుమతి ఉందని వెంచర్ నిర్వా హకులు ప్రచారం చేసుకొని ప్లాట్లు విక్రయించారు. ఆ తరువాత ఆ వెంచర్ కు రోడ్డు లేద న్న  విషయం కొనుగోలుదారులకు తెలిసి లబోదిబోమంటున్నారు.

మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 468, 469, 470, 471 సర్వే నంబర్లలో గ్రీన్ ప్రో రియాల్టర్ అనే సంస్థ వెంచర్ వేసింది. దానికి 472 సర్వే నెంబర్ లోని ప్ర భుత్వ భూమి నుంచి రోడ్డు వేశారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి తహసిల్దార్ గీత రోడ్డు ను తొలగించారు. కొన్నాళ్లకు మళ్లీ రోడ్డు వేయగా తహసిల్దార్ శైలజ, ప్రస్తుతం డిప్యూ టీ తాసిల్దార్ సునీల్ కుమార్ రోడ్డు తొలగించి కందకం తవ్వారు. రియల్ ఎస్టేట్ కంపెనీ రోడ్డు నిర్మించడం, రెవెన్యూ అధికారులు తొలగించడం తరచూ జరుగుతోంది. కానీ సంబంధిత వ్యక్తులపై కేసు నమో దు చేయడం లేదు. 

నక్షదారి సైతం కబ్జా 

వెంచర్ వేయకముందే ఆ స్థలంలో 33 అడుగుల నక్షదారి ఉంది. ఈ దారిని ఆక్రమించి ప్లాట్లు చేశారు. అంతేగాక గ్రామపంచాయతీకి పార్కు స్థలం, రో డ్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా కాలయాపన చేస్తున్నారు. ఈ విషయమై గ్రామపం చాయతీ అధికారులు నోటీసు జారీ చేసిన స్పందించడం లేదు. 

పార్కు స్థలం పనికిరాకుండా గుంతలు 

గ్రీన్ ప్రో రియాల్టర్ కంపెనీ వారు పార్కు స్థలాన్ని గ్రామపంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకపోవడమే గాక దానిలో మొత్తం గుంతలు తవ్వారు. ఈ స్థలం పనికిరాకుండా పోయింది. పెద్ద గుంత తవ్వడం వల్ల చెరువుల తయారయింది. 

కంపెనీకి నోటీసు ఇచ్చాం 

పార్కు స్థలం, రోడ్లు పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. పార్కు స్థలంలో గుంతలు తవ్వారు. గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన రుసుము కూడా చెల్లించలేదు. పార్కు స్థలం, రోడ్లు రిజిస్ట్రేషన్ చేయాలని, పార్కు స్థలంలో గుంత తవ్వినందున చదును చేయాలని, రుసుము చెల్లించాలని, ప్రహరీ పనులు నిలిపివేయాలని గ్రీన్ ప్రో రియల్టర్ కంపెనీకి ఇటీవల నోటీసు ఇచ్చాం. స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటాం. 

 -రమాదేవి, నూతనకల్ కార్యదర్శి