calender_icon.png 26 February, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలసవాదులతో నడిపితే భవిష్యత్తులో పార్టీకి మనుగడ ఉండదు

26-02-2025 01:44:36 AM

  • నీళ్లు తాగి పార్టీకి పని చేశాం ఖజానా ఆశించి పనిచేయలేదు

చిన్నారెడ్డిని విమర్శిస్తే పదవులు రావు ప్రజా ఆశీస్సులతో పదవులు వస్తాయి

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్

వనపర్తి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి):  వలస వాదులతో పార్టీని నడిపితే భవిష్యత్ లో పార్టీకి మనుగడ ఉండదని జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాద వ్ అన్నారు.  మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజు పీసీసీ రేవంత్ రెడ్డి , ఏఐసీసీ ఏ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించిన ఎక్కువ మొత్తంలో కార్యక్రమాలను నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చామన్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్న సమ యంలో చిన్నారెడ్డి జోడోయాత్ర, వరంగల్ డిక్లరేషన్, గ్రామ కమిటీలు మండల కమిటీలు వేస్తూ నియోజకవర్గంలో ఒక్కొక్క ఇల్లు నాలుగు సార్లు తిరిగి పార్టీ కి క్యాడర్ ని నిలబెట్టి గెలుపు గ్రాఫ్ ను పెంచారని  ఆ గ్రాఫ్ తోనే మెగా రెడ్డి  ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లో నిర్వహించిన మీడియా సమావేశంలో గోపాల్ పేట్ మాజీ ఎంపీపీ ప్రభావతి  చిన్నారెడ్డి  పై చేసిన అనుచిత వ్యాక్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

2006 సంవత్సరంలో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో మండల కేంద్రంలో గల 16 ఎంపీటీసీల్లో 8 కాంగ్రెస్ 8 టిడిపి పార్టీ గెలిచాయి ఆ సమయంలో చిన్నారెడ్డి  ప్రత్యేక చొరువ తో గోపాల్పేట్ ఎంపీపీ గా ప్రభావతిని చేశారని  ఆయన గుర్తు చేశారు.సత్య శిలా రెడ్డి  సర్పం గా పోటీ చేసే సమయంలో ఆయనకు పోటీగా సుధాకర్ రెడ్డి  పోటీ చేశారని అప్పు డు సత్యశిలా రెడ్డి  చిన్నారెడ్డి దగ్గరికి వచ్చి నేను ఎలాగైనా సర్పంచ్‌గా గెలవాలే సహకరించండి అన్న అని ప్రాధేయపడితే సుధాక ర్‌రెడ్డి  లోక్‌నాథ్‌రెడ్డికి దగ్గరి బంధువు కావడంతో చిన్నారెడ్డి  లోక్ నాథ్  రెడ్డి తో మాట్లాడి సుధాకర్ రెడ్డి ని విత్ డ్రా చేయించారు కాబట్టి ఆరోజు సర్పంచిగా గెలిచారని ఆయన గుర్తు చేశారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్లేవారు చిన్నారెడ్డి  గురించి విమర్శించే స్థాయి కాదని ఆయన హెచ్చరించారు. వనపర్తి లో కొందరు నాయకులు ఎవరి మెప్పు కోసం విమర్శిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితువు పలికారు.  ప్రభావతి  కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్లారని ఈరోజు అధికారంలో ఉందని ఇక్కడ ఉన్నారు రేపు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తారని ఆయన జ్యోసం చెప్పారు.

చిన్నారెడ్డి ఒకే ఒక పార్టీ నమ్ముకొని బతుకుతున్నారని మీ తీరుగా ఖజానా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే రకం కాదని హెచ్చరించారు.నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం పద్ధతి కాదని స్థాయి దాటి మాట్లాడితే సహించమని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కోట్ల రవి ,వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్,  వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి .కృష్ణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు  పాల్గొనడం జరిగింది.