calender_icon.png 27 October, 2024 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్‌పై పార్టీ చర్యలు తీసుకోవాలి

28-08-2024 03:03:00 AM

కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి 

కరీంనగర్ సిటీ, ఆగస్టు 27: కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావుపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్ కోరారు. నగరంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడారు. మేయర్ సునీల్‌రా వు ఆగస్టు 23న అమెరికా పర్యటనకు వెళ్లారని తమకు తెలిసిందన్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం 15 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజులు నగరంలో అందుబాటులో లేకుంటే మేయర్ డిప్యూటీ మేయర్‌కు ఇంచార్జి బాధ్యతలు ఇవ్వాలన్నారు.

కానీ అలా జరగకపోవడం కేవలం రాజకీయ కుట్ర  అన్నారు. తాము ఇదే విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో మేయర్ సెప్టెంబర్ 6న కరీంనగర్‌కు వస్తున్నానని వాట్సాప్‌లో మెసెజ్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఇంచార్జి బాధ్యతల గురించి కలెక్టర్‌ను అడగానే మేయర్ హుటాహుటిన 33 రోజుల టికెట్ క్యాన్సిల్ చేసుకుని, 14 రోజులకే తిరిగి వస్తున్నారన్నారు. తాను బీసీ మహిళ అయినందుకే మేయర్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేదన్నారు.