calender_icon.png 13 January, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్ నాకు ఆఖరు

23-07-2024 01:20:49 AM

న్యూఢిల్లీ: భారత హాకీ గోల్ కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ కీలక ప్రకటన చేశాడు. పారిస్ ఒలింపిక్స్ అనం తరం అంతర్జాతీయ హాకీ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు శ్రీజేశ్ వెల్లడించాడు. ఒలింపిక్ పతకంతో కెరీర్ ను ముగిస్తానని శ్రీజేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పారిస్ ఒలింపిక్స్‌తో నా కెరీర్‌కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యా. విశ్వక్రీడల్లో మ్యాచ్‌ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, భారత హాకీ జట్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం నా కెరీర్‌లో మరిచిపోలేనిది. ఇంతకాలం నాపై విశ్వాసముంచిన అంద రికి ధన్యవాదాలు. పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాల నుకుంటున్నాం. కచ్చితంగా ఈసారి పతకం రంగు మార్చాలనే కోరికతో ఉన్నాం’ అని శ్రీజేశ్ చెప్పుకొచ్చాడు. 36 ఏళ్ల పీఆర్ శ్రీజేశ్ 2006లో తొలిసారి భారత హాకీ జట్టుకు ఎంపిక య్యాడు. జాతీయ జట్టు తరఫున 328 మ్యాచ్‌లాడిన శ్రీజేశ్ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమ య్యాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు సభ్యుడిగా ఉన్నాడు.