విజయ్ కనిష్క (హిట్ లిస్ట్ ఫేమ్), రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), గరిమ చౌహాన్ హీరోహీరోయిన్లుగా వస్తున్న కొత్త చిత్రం ‘కలవరం’. డిఫరెంట్ కాన్సెప్ట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన లవ్‌స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శశాంక్ కథను అందించగా సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్, వికాస్ బాడిస సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. సీఎల్‌ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శోభారాణి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం ప్రారంభమైంది. చదలవాడ శ్రీనివాసరావు, సీ కళ్యాణ్ ప్రారంభించారు.