సబ్సిడీ కోసం ప్రత్యేక నిధులు?
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో వచ్చే ఏడాది లోగా లక్ష ఎకరాల్లో పామాయిల్ సాగును వ్యవసాయ శాఖ టార్గెట్‌గా పెట్టుకున్నది. ఈ ఏడాది 24,581 ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకుత్వరలో రైతులకు అవగాహన సద స్సులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కేంద్రం దిగుమతి సుంకం 27.5 శాతానికి పెంచడంతో ముడి పామాయిల్ ధర రూ.19వేలకు చేరుకుంది.
పామాయిల్ సాగు విస్తరణకు ప్రభుత్వం 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చిం ది. 25 ఏళ్లుగా తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం, సూర్యాపేట, నల్లగొం డ, మెదక్, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సుమారు 2.23లక్షల ఎకరాలు పామాయిల్ సాగు అవుతుంది. పామాయిల్ సాగు కోసం రాయితీలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
డ్రిప్, మోటార్లు, మొక్కల నిర్వహణ కోసం 60 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిసింది. ఎరువులు అందించేందుకు మార్క్‌ఫెడ్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 10 కోట్లతో భద్రాద్రి కొత్తగూడెంలో సెంటర్ ఆప్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది.