calender_icon.png 10 March, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపిరి తీసిన అప్పుల బాధ

07-03-2025 12:00:00 AM

  1.  రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
  2.  భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
  3. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం

ఆదిలాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైతు మృతిచెందగా, అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వడూర్‌కు చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), ఆయన భార్య ఇందిరా(52)కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

పంట దిగుబడి అంతగా రాకపోగా, కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో బుధవారం రాత్రి భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం పోశెట్టి తన కూతురు, అల్లుడికి ఫోన్ చేయగా, హుటాహుటిన వచ్చిన అల్లుడు, కూతురు వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్సపొందుతూ గురువారం భర్త పోశెట్టి మృతి చెందగా.. భార్య ఇందిరా పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి అల్లుడు కిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.