అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు ఆస్కార్‌ను సైతం తాకింది. సినీ రంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ దీని కారణంగా ఆలస్యమైంది. వాస్తవానికి ఈనెల 8 నుంచి 1౨ వరకూ నామినేషన్ ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. అయితే కార్చిచ్చు కారణంగా ఓటింగ్‌ను 14 వరకూ పొడిగించారు. 17న ప్రకటించాల్సిన నామినేషన్లను 19న ప్రకటిస్తామని సంస్థ తెలిపింది.
ఆస్కార్ వేడుక వచ్చేసి ఈ ఏడాది మార్చి 2న జరగాల్సి ఉంది. 97వ అకాడమీ అవార్డ్స్‌లో మొత్తం 323 చలనచిత్రాలుండగా.. వాటిలో 207 ఉత్తమ చిత్రాల విభాగంలో పోటీ పడనున్నాయి. వీటిలో ఆరు భారతీయ చిత్రాలున్నాయి. మరి ఈ ఆరింటిలో ఎన్ని ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.