29-04-2025 01:10:44 AM
హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ
హనుమకొండ, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా డిసిసి భవన్ నందు హనుమకొండ, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల టీపీసీసీ అబ్జర్వర్లు ఎమ్మెల్సీ అమర్ అలీ ఖాన్, వినయ్ రెడ్డి, హైమద్, పులి అనిల్ కుమార్.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు లతో కలిసి పాల్గొన్న హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయం రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తదనంతరం మాట్లాడుతూ తొలుత జమ్ము కశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ నాయకులు, కార్యకర్తలు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకుల నుంచి అబ్జర్వర్లు జిల్లా పార్టీ అధ్యక్షులు పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్ మ్యాప్ ను ఖరారు చేసిందని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు, యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్ఠానం నిర్ణయించడం, ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని, మహిళలు, యువతకు ప్రాధాన్యం పెంచాలని సూచించారని, కాంగ్రెస్ మండల, బ్లాక్, డీసీసీ పదవుల్లో సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
2017 నుంచి పార్టీలో ఉన్నవారికే పదవులు ఇవ్వాలని సూచించారని, పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణపై గాంధీభవన్లో జరిగిన సమావేశంలో కీలకమైన సూచనలు చేశారని తెలిపారు. సంస్థాగత నిర్మాణం బలంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీగా మీనాక్షి నటరాజన్ నియమితులైన నాటి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించారని అన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలుచేశామని, సంస్థాగత ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, టిపిసిసి జనరల్ సెక్రెటరీ కూచన రవళి, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, యూత్ రాష్ట్ర నాయకులు తక్కలపల్లి సాగరిక - రమాకాంత్, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ , కొరివి పరమేష్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, డివిజన్, గ్రామ స్థాయి అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.