calender_icon.png 15 January, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షం నన్ను ప్రధానిని చేస్తానంది

16-09-2024 05:18:15 AM

  1. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు 
  2. సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడి

నాగ్‌పూర్(మహారాష్ట్ర), సెప్టెంబర్ 15:  ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించినట్లు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన జర్నలిజం అవార్డుల వేడుకలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘తాను ప్రధాని రేసులో ఉంటే మద్దతు ఇస్తామని అపోజిషన్‌కు చెందిన ఓ ప్రముఖ నేత తనతో చర్చలు జరిపారు’ అని చెప్పారు.

అందుకు తాను.. మీరు నాకు ఎందుకు మద్దతివ్వాలి, మీ మద్దతు నేను ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించానని తెలిపారు. ప్రధానమంత్రి కావడమే నా జీవిత లక్ష్యం కాదని చెప్పి ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. తాను ఏ పదవి కోసం ఆశపడనని, బీజేపీకి విధేయుడిగా ఉంటానని స్పష్టం చేశారు. 

‘సుపారీ’ జర్నలిజం ..

జర్నలిజం గురించి గడ్కరీ మాట్లాడుతూ.. మీడియా రంగంలో ‘సుపారీ’ జర్నలిస్టుల సంఖ్య పెరుగుతోందన్నారు. కొంతమంది తమ ప్రయోజనాల కోసం మీడియా పేరును వాడుకొని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని, అలాగే ఆర్‌టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక జర్నలిస్ట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆర్‌టీఐని ఉపయోగించా రని గడ్కరీ ఆరోపించారు.