calender_icon.png 10 March, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు

11-12-2024 02:13:48 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమని రాష్ర్ట వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

గత పదేళ్లు పాలనలో ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారు స్తూ రాజకీయాలు చేస్తున్నారని... ఇది వారి ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

రాజకీయ ప్రేరేపిత ధర్నా, నిరసనలు తెలిపే వారి ఉచ్చులో పడొద్దన్నారు. ఆశా వర్కర్ల నిరసనలో సొమ్ముసిల్లి పడిపోయిన ఆశావర్కర్ రహీంబీకి ఉస్మానియా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను మంత్రి అదేశించారు.