మంథని, జనవరి 7 (విజయక్రాంతి): రైతుల మోహంలో ఆనందం చూసి ఓ్ంవలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని లో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పెట్టుబడి సహాయంగా గత ప్రభుత్వం రూ. 5,000 వేలు ఇ చ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పెంచి సంవత్సరానికి రూ. 12,000 వేలు ఇస్తున్న సంద ర్భంలో రైతుల మోహంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు గగ్గోలు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలును చూసి ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, ఏ నైతిక హక్కుతో మమ్ములను ప్రశ్నిస్తున్నారో, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పే అవసరం బీఆర్‌ఎస్ పార్టీపై ఉందన్నారు.
గ్రామపంచాయతీల వారీగా రైతుల పేర్లతో బోర్డులు
ప్రభుత్వం నుంచి లబ్ధి శపొందిన రైతుల వివరాలను గ్రామపంచాయతీల వారీగా రైతుల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జెసి అరుణశ్రీ, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాసురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, పిఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.