calender_icon.png 13 March, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాలకు గవర్నర్ అంటే గౌరవం లేదు

13-03-2025 02:14:16 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): గవర్నర్ అంటే ప్రతిపక్ష సభ్యులకు గౌరవం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడాన్ని తప్పబట్టారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో గవర్నర్ ప్రసంగం వింటే తెలుస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నా రు. ఏప్రిల్ 27న కేసీఆర్ వరంగల్‌కు వచ్చి ఏం చేస్తారని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.