calender_icon.png 15 March, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాప్ 10లో ఒక్కరే మహిళ

15-03-2025 12:30:14 AM

  1. మిగతా తొమ్మిది ర్యాంకులు పురుష అభ్యర్థులవే.. 
  2. మొదటి-50 ర్యాంకర్లలో నలుగురే మహిళలు
  3. గ్రూప్-3 ఫలితాల్లో పురుషులదే హవా 
  4. 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షల ఫలితాలు

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ దూకుడు పెంచుతు న్నది. గ్రూప్స్ ఫలితాలను వెనువెంటనే విడుదల చేస్తున్నది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్- 2 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ శుక్రవారం గ్రూప్ -3 ఫలితాలు సైతం విడుదల చేసింది.

హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ మేరకు కమిషన్ చైర్మన్ బీ వెంకటేశం అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్‌సైట్‌లోకి విడుదల చేశారు. టాప్-10 ర్యాంకులు సాధిం చిన వారిలో ఒక్కరే మహిళ అభ్యర్థి కాగా, మిగతా తొమ్మిది ర్యాంకులు పురుష అభ్యర్థులవే.

అలాగే టాప్-50 ర్యాంకులు సాధిం చిన వారిలో నలుగురు మాత్రమే మహిళలు. అలాగే టాప్-92 మంది ర్యాంకులు సాధించిన వారిలో పదిమంది మాత్రమే మహిళలు ఉన్నారు. గ్రూప్-3 పరీక్షను 450 మార్కులకు నిర్వహించగా.. మొదటి ర్యాంకర్ 339.239 మార్కులు, సెకండ్ ర్యాంకర్ 331.299 మార్కులు, మూడో ర్యాంకర్ 330.427 మార్కులు సాధించారు. మహిళల్లో టాప్ ర్యాంకర్ 325.157 మార్కు లు సాధించారు.

అభ్యర్థులు తమ లాగిన్ ఐడీలతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓఎంఆర్ షీట్లు చూసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. అలాగే 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇక మిగిలిన నోటిఫికేషన్లపై త్వరలోనే స్పష్టత ఇస్తామని, పరీక్షల ఫలితాలపై ఎవరూ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించింది.