హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఈ నెల 2, 5, 8వ తేదీల్లో నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పాఠశాల విద్యాశా ఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం మొదటి పరీక్షకు 9,759 (77.12 శా తం) మంది, మధ్యాహ్నం పరీక్షలకు 9,290 (73.84 శాతం) మంది హాజరైనట్లు తెలిపారు.
5న నిర్వహించిన మొదటి సెషన్‌లో 77.39 శాతం, రెండో సెషన్‌లో 76.06 శాతం, 2న మొదటి సెషన్‌లో 72.25 శాతం, రెండో సెషన్‌లో 75.68 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. గురువారం కూడా టెట్ పరీక్షను నిర్వహించనున్నారు.