calender_icon.png 27 December, 2024 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సా...గుతున్న బడి భవన పనులు

27-12-2024 01:57:26 AM

 మహబూబాబాద్డిసెంబర్ 26 (విజయక్రాంతి):  ఎన్ని ప్రభుత్వాలు మారిన మహబూబాబాద్ జిల్లా  ఇనుగుర్తి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న అదనపు భవన నిర్మాణం మాత్రం పూర్తికావడం లేదు. ఏడేళ్ల క్రితం రూ.25 లక్షల అంచనాతో ప్రారంభమైన పనులు స్లాబు వరకు పూర్తయ్యాయి.

తర్వాత ప్లాస్టరింగ్ చేయాల్సి ఉండగా, కారణాలెంటో తెలియదు గానీ కాంట్రాక్టర్ పనులను పక్కన పెట్టేశాడు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి సంఖ్య తగినట్లు అదనపు తరగతులు లేవు.

ఈ నేపథ్యంలో నిలిచిపోయిన భవన పనులను సత్వరం పూర్తి చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.