calender_icon.png 27 December, 2024 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగనున్న పుష్పరాజ్ విధ్వంసం

04-12-2024 12:00:00 AM

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘పుష్ప2’ డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. ఇప్పటికే రికార్డుల విధ్వంస రచనకు తెరతీసిన ‘పుష్పరాజ్’.. పార్ట్2 విడుదల కు ముందే మూడో భాగానికి సంబంధించిన చర్చ మొద లైంది. ఈ చర్చకు బలం చేకూర్చుతూ మంగళవారం ‘పుష్ప పార్ట్ సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మూడో భాగం ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ అనే టైటిల్‌తో వస్తోందని ప్రచారం జరుగుతోంది.

అయితే, ‘పుష్ప2’ క్లుమైక్స్‌లో ‘పార్ట్-3’కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపించనున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. అదీగాక గతంలో అల్లు అర్జున్ కూడా ‘పుష్ప పార్ట్3’ ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ‘వైల్డ్ ఫైర్ జాతర’ పేరుతో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. “నేను మీ హీరోను మూడేళ్లు కష్టపెట్టాను. మీరు, మీ హీరోను అడగండి.

నేను నా ఫ్రెండ్ (అల్లు అర్జున్)ను అడుగతాను. నా కోసం మళ్లీ మరో మూడేళ్లు ఇస్తే తప్పకుండా ‘పుష్ప3’ చేస్తా” అని చెప్పారు. ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందు లో ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ అని రాసి ఉండటం ‘పుష్ప౩’ని కన్ఫా ర్మ్ చేస్తోంది. అయితే  ‘పుష్ప2’ విడుదల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టుల్లో నిమగ్నం కానున్నారు. ఈ కారణంగా మూడో భాగం రూపంలో పుష్పరాజ్ కొనసాగించే ‘ర్యాంపేజ్’ (విధ్వంసం)ను చూడాలంటే ఇంకా మూడేళ్లయినా ఆగక తప్పదు.