calender_icon.png 28 April, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్టలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలి

28-04-2025 12:38:37 AM

సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్

ఇల్లెందు టౌన్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మావోయిస్ట్ పార్టీ తో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ  పిలుపు మేరకు ఆ పార్టీ కొమరారం పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

కొమరారం పంచాయతీ కమిటి కార్యదర్శి బానోత్ సంతు అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి  తుపాకుల నాగేశ్వరరావు, ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు లు మాట్లాడుతూ చత్తీస్ ఘడ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట  గత నాలుగైదు రోజు లుగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నది. ఈ సరిహద్దు ప్రాంతం లో నివాసం ఉంటున్న ఆదివాసి, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో  పెట్టుకుని భయానక వాతావరణంలో బిక్కుబెక్కుమంటూ జీవిస్తున్నారని తెలిపారు..

ఇప్పటికీ హెలికాప్టర్స్, డ్రోన్ ల ద్వారా దాదాపు 20 వేల మంది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేయగా, ప్రతిరోజు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయని ఇప్పటికే, 40 మంది మావోయిస్టులను హతమార్చినట్టు ప్రసార, ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని, తెలంగాణ లోని వెంకటాపూర్, వాజేడు, ములుగు ప్రాంతాల్లో వేలాదిగా పోలీసు బలగాలు మోహరించారన్నారు.

కర్రెగుట్ట  పై ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుండి  ఇటు తెలంగాణ, అటు చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రిం చే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కర్రేగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ  పోలీస్ బలగాలని వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసి గిరిజనులని వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ  కొమరారం పంచాయతీ కమిటీ డిమాండ్ చేస్తోంది.. ఈ కార్యక్రమం లో కొమరారం గ్రామ కార్యదర్శి మోతిలాల్, నర్సయ్య, మండల నాయకులు మూడు మాలు, జోగా క్రిష్ణ, శ్రీను, రాజాలు, తుడుం శ్రీను, వెంకట్రాం, ధర్మ భద్రయ్య, పాపన్న, మల్లెల క్రిష్ణ, నాలి సురేష్, తదితరులు పాల్గొన్నారు.