calender_icon.png 1 November, 2024 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న బక్క జడ్సన్ దీక్ష

05-07-2024 12:08:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ వనరుల రక్షణ సేన ఆవిర్భావ అధ్యక్షుడు, ఏపీవీసీసీ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ తన ఇంట్లో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజూ కొనసాగింది. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు దీక్ష కొనసాగిస్తానని జడ్సన్ తెలిపారు. గురువారం ఆయన పలు డిమాండ్లతో సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్  ప్రిలిమ్స్‌కు 1:100 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు అవకాశం కల్పించారన్నారు. ఈ ప్రకారం అవకాశం ఇస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని, ప్రిలిమ్స్‌లో తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా మెయిన్స్‌లో మెరిట్ సాధించిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు.