calender_icon.png 15 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపద కాపాడేవాడూ సైనికుడే!

08-08-2024 02:27:55 AM

రవితేజ, హరీశ్ శంకర్ కాంబో ‘మిస్టర్ బచ్చన్’తో మరో మాస్ సునామీని సృష్టించడానికి సిద్ధమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న విడుదల కానుం ది. ఇప్పటికే టీజర్‌తోపాటు పాటలు విడుదల చేసిన చిత్రబృందం బుధవారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ రవితేజ చెప్పిన ‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంప ద కాపాడేవాడు కూడా సైనికుడే’ అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. తన ఊళ్లో జిక్కీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న బచ్చన్ పవర్ ఫుల్ వ్యక్తికి వ్యతిరేకంగా ఐటీ దాడులకు నాయకత్వం వహించడానికి యాక్షన్‌లోకి దిగుతాడనేది ట్రైలర్‌లో చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ, చరిష్మా అద్భుతంగా ఉంది. జగపతిబాబు పవర్ ఫుల్ రోల్ పోషించారు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. కమర్షియల్ సబ్జెక్టును హ్యాండిల్ చేయడంలో హరీశ్ శంకర్ తనదైన నైపుణ్యాన్ని మరోసారి చూపించనున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.