calender_icon.png 10 January, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిదిని హతమార్చిన వదిన

02-11-2024 02:17:42 AM

ఖమ్మం, నవంబర్ 1 (విజయక్రాంతి): పండుగపూట విషాదం చోటుచేసుకుంది.  క్షణికావేశంలో సొంత మరిదిని ఓ వదిన హతమార్చిన ఘటన ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోర్ల రామయ్యకు ప్రశాంత్, ప్రియాంక, ప్రదీప్ సంతానం. దీపావళి పండుగ  సందర్భంగా ప్రియాంకను అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చారు.

గురువారం రాత్రి ప్రశాంత్ భార్య ఇందూ, ప్రియాంక మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ విషయం ప్రదీప్‌కు తెలియడంతో వదిన ఇందూను నిలదీశాడు. దీంతో వారి మధ్య మాట మాట పెరిగింది. ఆగ్రహానికి లోనైన ఇందూ కత్తితో ప్రదీప్‌ను పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతణ్ణి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.