calender_icon.png 21 March, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష కి.మీ రథయాత్ర విజయవంతం చేయాలి...

20-03-2025 11:16:14 PM

ధర్మసమాజ్ పార్టీ...

కామారెడ్డి (విజయక్రాంతి): ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఏప్రిల్ 14 నుంచి చేపట్టనున్న లక్ష కిలోమీటర్ రథయాత్రని విజయవంతం చేయాలని ధర్మాసమాజ్ పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి భోలేశ్వర్, జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రకుల పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ ల ఉచ్చు నుంచి అనగారిన వర్గాల ప్రజలను విముక్తి చేసి అంతిమంగా అధికారం సాధించడమే ఈ రథయాత్ర ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.