calender_icon.png 30 October, 2024 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత టైంటేబుల్‌నే కొనసాగించాలి: పీఆర్‌జీటీఏ

06-07-2024 12:05:54 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు ప్రకటించిన కామన్ టైం టేబుల్‌లో శాస్త్రీయత లోపించిందని పీఆర్‌జీటీఏ అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పూల రవీందర్, రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ ఇక్బాల్ అహ్మద్‌ను కలిసి ఈ మేరకు వారు వినతిప్రతం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన టైంటేబుల్ వలన విద్యార్థుల మానసిక స్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని.. పాత టైంటేబుల్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరారు.