calender_icon.png 6 January, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్చీలోనే ఆగిన వృద్ధుడి గుండె

06-10-2024 12:31:10 AM

నాగర్‌కర్నూల్ బస్టాండ్‌లో ఘటన

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): భార్యతో కలిసి దైవదర్శ నాకి వెళ్లేందుకు వచ్చిన ఓ వృద్ధుడు భార్యతో కలిసి బస్టాండులోని కుర్చీ లో కూర్చోని ముచ్చటిస్తూనే మృతిచెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది. అడ్డాకల్ మండలం కొనగల్ గ్రామానికి చెందిన కొమ్ము వెంకటయ్య(60) తన భార్య వెంకటమ్మతో కలిసి తాడూరులోని దైవదర్శనికి వెళ్లేందు కు వచ్చారు. కల్వకుర్తి బస్సుకోసం బస్టాండ్‌లో వేచి ఉంటూ కుర్చీలో కుర్చోని భార్యతో ముచ్చటిస్తూనే కన్ను మూశాడు.