calender_icon.png 17 January, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత ఫ్యాకల్టీనే కొనసాగించాలి

06-09-2024 12:00:00 AM

గౌలిదొడ్డిలో విద్యార్థుల ఆందోళన

రాజేంద్రనగర్/ శేరిలింగంపల్లి, సెప్టెంబర్5: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ)లో విద్యార్థులు గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశా లలో పనిచేస్తున్న 22 మంది తాత్కాలిక ఉపాధ్యాయుల(గెస్ట్ లెక్చరర్లు)ను ఇటీవల సొసైటీ తొలగించింది. తదనంతరం వారి స్థానంలో కొత్తవారిని నియమించి బోధన సాగిస్తోంది.

అయితే తొలగించిన ఉపాధ్యాయులు..తమకు రెగ్యులర్ బోధనతో పాటు ఐఐటీ, నీట్ బోధన కూడా చేపట్టేవారని.. కొత్తవారు కేవలం రెగ్యులర్ సబ్జెక్టులు తప్ప.. ఐఐటీ, నీట్ బోదణ చేపట్టడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అధ్యాపకులను తొలగిస్తే తమ చదువుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులకు తోడుగా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పాత ఉపాధ్యాయు లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.