13-03-2025 01:41:57 AM
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): డీసీఎంఎస్‌ల(జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు) పాలక వర్గాల పదవీ కాలం గడువు ముగియడంతో ఆ స్థానంలో పర్సన్ ఇన్ చార్జ్‌లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 75 ఆధారంగా సహకార శాఖ రిజిస్ట్రార్ జారీ చేసిన ప్రొసిడింగ్స్ అమలును నిలిపిస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
డీసీఎంఎస్‌లకు అదనపు కలెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించడం వివక్షాపూరితమైన నిర్ణయమని పేర్కొంది. ఒకే రోజు పదవీ కాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), డీసీసీబీ, టీజీసీఏబీలకు మాత్రం ప్రస్తుతం ఉన్న సభ్యులనే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించిన ప్రభుత్వం డీసీఎంఎస్‌లకు మాత్రం ఎన్నికైన డైరెక్టర్లను కాదని అదనపు కలెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జ్ లుగా నియమించడం సరికాదని పేర్కొంది. పీఏసీఎస్, డీసీసీబీల వలె డీసీఎంఎస్‌లకు కూడా పాత డైరెక్టర్‌లనే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.