* హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
* మెట్రో భూనిర్వాసితుల పరిహారంపై హర్షం
* మెట్రో స్టేషన్ల వద్ద వ్యాపారస్థులకు మినహాయింపులివ్వాలి
* 7.5 కిలోమీటర్ల మేర ఓల్డ్‌సిటీ మెట్రోలైన్: మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): గత పాలకులు పాతబస్తీకి మెట్రో విస్తరణపై నిర్లక్ష్యం చేశారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం శంకుస్థాపన చేయడంతో పాటు పనులు మొదలు పెట్టడం హర్షణీయమన్నారు.
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ నిర్వహించిన కార్యక్రమంలో మెట్రో ఫేజ్ భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యాక్రమానికి అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.
41మంది లబ్ధిదారులకు రూ.20కోట్ల నష్టపరిహారాన్ని అందజేశారు. అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పాతబస్తీకి మెట్రోను విస్తరింపజేయాలని అసెంబ్లీ ఎన్నికల అనంతరం తాము సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని తెలిపారు. తదనంతరం సీఎం శంకుస్థాపన చేయడంతో పాటు నిధులు కూడా కేటాయించారని అన్నారు.
మెట్రో కారిడార్ నిర్మాణం సందర్భంగా హిందూ, ముస్లిం, ఇతర మతపరమైన కట్టడాలను రక్షించడం హర్షణీయమన్నారు. హైదరాబాద్‌కు వచ్చే సందర్శకులు, స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా స్కైవాక్‌లు కట్టాలని, రోడ్లు, ఫుట్‌పాత్‌లను వెడల్పు చేయాలని సూచించారు. బాధితులకు చెక్కులు అందజే కూల్చివేతలకు కొంత సమయమివ్వాలని కోరారు.
మిలాద్‌ఉన్‌నబీ, గణేశ్ ఉత్స ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెట్రో స్టేషన్లు నిర్మించే చోట వ్యాపారాలు చేసుకునేవారికి మినహాయింపులు ఇవ్వాలన్నారు. పాతబస్తీ నుంచి ప్రతిరోజు 8 మం యువత హైటెక్‌సిటీకి వెళ్తున్నారని.. మె రాకతో వారికి ఉపశమనం కలుగుతుందన్నారు.
రూ.2,741 కోట్లతో 7.5 కిలోమీటర్ల విస్తరణ..
పాత బస్తీ ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని.. పురానా షహర్ కాదు.. అసలీ షహర్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారని హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రూ.2,741 కోట్లతో 7.5 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపడుతున్నామన్నారు.
చాంద్రాయ మంచి జంక్షన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. చార్మినార్, లాడ్‌బజార్, సాలార్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలకు స్కైవాక్‌లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, ప్రత్యేక వసతులు కల్పిస్తామన్నారు.
దీంతో పాతబస్తీకి పెట్టుబడులు రావడంతో పాటు స్థానికులకు ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రావడానికి ఇంకా ౩ నెలల సమయం పడుతుందని, అప్పటివరకు రోడ్ల్ల విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి షాఅలీబండ వరకు 60 ఫీట్లు ఉన్న రోడ్డును 100 ఫీట్లకు, షాఅలీ బండ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న 80 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లకు విస్తరిస్తామన్నారు.
దశలవారీగా చెక్కులు అందజేస్తాం
ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.60వేలు ఇవ్వాల్సి ఉందని, కానీ ప్రభుత్వం గజానికి రూ.81వేలు పరిహారాన్ని భూనిర్వాసితులకు ఇస్తోందని కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి అన్నారు. దీన్ని అందరూ ఆహ్వానించారని మొత్తం 1100 ఆస్తులకు రూ.1000 కోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించనున్నామని తెలిపారు.
దశలవారీగా భూనిర్వాసితులందరికీ చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ కె.స్వర్ణలత, ఆర్డీవో రామకృష్ణ, జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులు, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.