calender_icon.png 10 January, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి

03-01-2025 11:05:59 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం ఓల్డ్ ఏజ్ హోం నూతనంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్‌లైన్ బోరు నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. భవనం చుట్టూ ఫెన్షింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ రాజన్న, మున్సిపల్ కమిషనర్ స్పందన, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేష్, సీడీపీవో రోఛిష్మ, తహసీల్దార్ జనార్దన్, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.