calender_icon.png 17 January, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో బదిలీ అయిన అధికారులను వెనక్కి తేవాలి

06-07-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5(విజయక్రాంతి): ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన అధికా రుల ను వెనక్కి తేవాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, ఏ సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాంపల్లి గృహకల్పలో గల గెజిటెడ్ భవన్‌లో కేంద్ర సంఘ కార్యవర్గం వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు సాధారణ బదిలీలపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పా రు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెం టనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం, ఉద్యోగుల సమాన నిష్పత్తిలో కాంట్రిబ్యూషన్ చేసి ఉద్యో గుల ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని కోరారు. మెడికల్ రీయిం బర్స్‌మెంట్ కాలాన్ని పెంచాలని, ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. అన్ని శాఖల్లో డీపీసీని నిర్వహించి పదోన్నతులు కల్పించాలని కోరారు.