calender_icon.png 25 September, 2024 | 5:52 AM

ఫారెస్టు హద్దులు మార్చిన అధికారి

25-09-2024 01:12:59 AM

విధుల నుంచి తొలగింపు

ఇల్లెందు, సెప్టెంబర్ 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు డివిజనల్ ఫారెస్టు అధికారి కె వెంకన్నను విధుల నుంచి తొలగిస్తూ మంగళవారం ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్టు డోబ్రియాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో వెంకన్న ఇల్లెందు రేంజ్ అధికారిగా పనిచేశారు.

ఆ సమయంలో ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు రిజర్వుఫారెస్టు భూమి అవసరం పడింది. రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో పాటు ప్రాజె క్టు ఇంజనీర్లు రిజర్వుఫారెస్టు భూమి ఎంత అవసరం ఉంటుందో అక్కడి వరకు హద్దులు నిఖరం చేశారు.

ఆ హద్దు ప్రకారం వెంకన్నకు సంబంధించిన వాళ్ల పొలాలు పోతుండటం తో గుట్టుచప్పుడు కాకుండా హద్దు లు మార్చాడు. కార్యాలయంలో పనిచేస్తున్న మరో వ్యక్తి ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. రిజర్వు ఫారెస్టులో హద్దులు మార్చినట్టు తేలడంతో వెంకన్నను విధుల నుంచి తొలగించారు.