- నిమజ్జనానికి అందరూ సహకరించాలి
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో మే యర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 17వ తేదీన జరగబోయే నిమజ్జనానికి అందరూ సహకరిం చాలన్నా రు. ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు, 17న ప్రజాపాలన దినోత్సవం కూడా ప్రశాం త వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇది రాజకీయాలకు సమ యం కాదని హెచ్చరించారు. గొడవలు సృ ష్టించే ప్రయత్నం చేసినా, సోషల్ మీడియా లో ప్రజలను పక్కదారి పట్టించే పోస్టు లు పెట్టినా సహించేది లేదన్నారు. గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్షించారని చెప్పారు. పదేళ్లలో ఇదే మొదటిసారని గుర్తు చేశారు. నిమజ్జనం సందర్భంగా నగరంలో ఎలాంటి రాజకీయ, ఇతర ర్యాలీలకు అనుమతి లేదని మంత్రి తెలిపారు.
ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ పండు గ ఉన్నందున, ఆ పండుగను 19న జరుపుకొనేందుకు ముస్లిం మత పెద్దలు అంగీకరిం చారని చెప్పారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నిమజ్జనానికి 25 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ట్రాఫి క్ ఇబ్బందులు కలగకుండా మళ్లింపు చర్య లు తీసుకోబోతున్నట్లు చెప్పారు. కాగా, నిమజ్జనానికి వివిధ శాఖల నుంచి దాదాపు 5 వేల మంది అధికారులు విధులు నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ అనుదీప్ చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, పోలీసు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.