calender_icon.png 25 January, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వనరులలో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ధ్యేయం

24-01-2025 11:44:09 PM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

ముడుగోడు (విజయక్రాంతి): నీటి వనరులలో నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ధ్యేయం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తన వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి  కలిసి నియోజకవర్గంలోని నీటి వనరుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులైన  శివన్న గూడెం, కిష్రాంపల్లి రిజర్వాయర్లకు నీటిని తెచ్చే విషయంతో పాటు శివన్న గూడెం రిజర్వాయర్ నుండి నారాయణపూర్ చౌటుప్పల్ మండలాలకి నీటి తరలింపుపై చర్చించారు.  నియోజకవర్గంలో  మొదటి విడతగా 122 చెరువులను, 18 చెక్ డాం లను, 19 సబ్ సర్ఫేస్ డైక్ లను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టారు.

ఈ 122 చెరువులలో 100 ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న 32 చెరువులు, 50 ఎకరాల నుండి 100 ఎకరాల మధ్య విస్తీర్ణం ఉన్న 46 చెరువులు, 50 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న 44 చెరువులను వచ్చే వానకాలం వరకు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు గొలుసుకట్టు చెరువుల ఫీడర్ ఛానల్ లలో పూడిక తీయడం, కంపచెట్లను తొలగించడం లాంటి పనులను కూడా సమాంతరంగా చేయాలని అన్నారు. రాబోయే వానాకాలం సీజన్ వరకు ఈ పనులు పూర్తి చేసే విధంగా చూడాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ చరవాణ్ణిలో సభాసించారు. చిన్న నీటి వనరులను ఒడిసిపడుతూనే మరోవైపు భారీ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ రిటైర్డ్ శ్యాంప్రసాద్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు.