నిర్మల్ (విజయక్రాంతి): దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ఆర్థిక ప్రోత్సాహం యూనిట్లను పెంచాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్తి సాయన్న డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు కేవలం 21 యూనిట్లు మాత్రమే మంజూరు చేయడం వల్ల దివ్యాంగులకు న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో 5000 నుంచి 8000 వరకు దివ్యాంగులు ఉన్నారని యూనిట్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాయకులు భగవాన్ ముత్యం రాజు నేతలు పాల్గొన్నారు.