calender_icon.png 4 February, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుల స్వయం ఉపాధి రుణాల యూనిట్స్ సంఖ్య పెంచాలి

03-02-2025 11:48:46 PM

మలక్‌పేట: వికలాంగుల స్వయం ఉపాధి రుణాల యూనిట్స్ సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంట్, కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడూతూ.. 2024 ఆర్థిక సవత్సరానికి నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం ఇస్తున్న రుణాల యూనిట్స్ సంఖ్యను ప్రతి మండలానికి 25 యూనిట్స్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 771 మందికి మాత్రమే రూ.50,000 చొప్పున రూ.3.55 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. గతంలో రూ.50,000 నండి రూ.3,00,000 వరకు రుణాలు మంజూరు చేసే వారన్నారు. ఈ సందర్భంగా ఏడీ అరుణకు వినతి పత్రం అందజేశారు. స్వయం ఉపాధి యూనిట్స్ పెంచేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కె.చంద్రమోహన్, మల్లేశ్, సుల్తాన్, లక్ష్మీపతి, శ్రీనివాస్, ఈశ్వర్, నర్సింహ్మా, సత్యలక్ష్మీ, రాజమౌళి, యాజ్ భాషా తదితరులు పాల్గొన్నారు.