calender_icon.png 21 November, 2024 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలికరీనగర్ జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి

11-11-2024 02:09:05 AM

 శంకుస్థాపన చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే

కరీంనగర్, నవంబరు 10 (విజయక్రాంతి): కోర్టులో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఆదివారం కరీంనగర్ కోర్టు ఆవరణలో జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి, సీతారాంపూర్ రోడ్డులో న్యాయాధికారుల నివా స గృహాల నిర్మాణాలకు ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా అలోక్ అరాదే మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గిం చేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు.

కరీంనగర్ కోర్టు భవ నం 18 నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. అంతకు ముందు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులకు కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ప్రతిమ స్వాగతం పలికారు. పోలీసులు ప్రధాన న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మణ్, వినోద్‌కుమార్, విజయసేన్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, వేణుగోపాల్, కార్తీక్, శ్రీనివాసరావు, హైకో ర్టు పూర్వ జడ్జి నవీన్‌రావు, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, కార్యదర్శి బేతి మహేందర్ పాల్గొన్నారు.