calender_icon.png 15 January, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

05-01-2025 12:00:00 AM

నాగర్‌కర్నూల్ జనవరి 4 (విజయ క్రాంతి) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య మరింత పెరగాలని నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని స్వరాజ్యలక్ష్మి సూచించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా  దేశిటిక్యాల బస్తీ దవాఖాన, పెద్ద ముద్దనూరు, వెన్నచెర్ల, కోడేరు, పెద్దకొత్తపల్లి పీహెచ్సీలు నక్కలపల్లి, పసుపుల ఆరోగ్య ఉపకేంద్రాలను తనిఖీ చేశారు.

దేశి ఇటిక్యాల గ్రామంలో టీకాకీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ప్రతి చిన్నారికి సంపూర్ణ టీకాకీకరణే లక్ష్యంగా పనిచేయాలని, గర్భవతులు, చిన్నారుల టీకా వివరాలను యు-విన్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.  గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం వరకు గర్భవతిని పర్యవేక్షణ చేస్తూనే సాధారణ కాన్పు జరిగేలా వారికి భరోసా కల్పిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సుఖ ప్రసాదం జరిగేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.

సమయపాలన పాటించని వారిపై శాఖా పరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. గర్భవతుల చెకప్, పిల్లల టీకాకీకరణ కోసం 102 వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే 30 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి రక్తపోటు, మధుమేహం వ్యాధులను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు, ఫీల్డ్ స్థాయి సిబ్బందికి సూచించారు.