08-02-2025 12:00:00 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : మాతా శిశుమరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశకార్యకర్తలతో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతా, శిశుమరణాల రేటు అధికంగా ఉండడం బాధాకరమని పేర్కొన్నారు.
దీన్ని నివారించేందుకు ప్రభుత్వ వైద్యులు, ఆశవర్కర్లు కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పారు. గత రెండు నెలలతో పోలిస్తే జిల్లాలో మాత, శిశు మరణాల సంఖ్య తగ్గిందని తెలిపారు.
గర్భిణులకు పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచించారు. సమావేశంలో డీఎంహెఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెఎస్ మాతృనాయక్, డాక్టర్లు స్వరూప రాణి, వందన, డిప్యూటీ డీఎంహెఓలు, పీహెసీ వైద్యులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.