14-02-2025 12:47:12 AM
తాడ్వాయి, ఫిబ్రవరి, 13( విజయ క్రాంతి): గ్రామాలలో కూలీల సంఖ్యను పెంచాలని తాడువాయి ఇన్చార్జి ఏపిఓ కృష్ణ గౌడ్ తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన గురువారం క్షేత్ర సహాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కచ్చితంగా 50 నుంచి 100 మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో హాజరయ్యేలా చూడాలని కోరారు గ్రామాల్లో వనమోత్సవం లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఫీల్ అసిస్టెంట్లు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి మహిపాల్ రెడ్డి ఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు