calender_icon.png 1 February, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా కుంభమేళా భక్తుల సౌకర్యార్ధం విమాణ సర్వీస్‌ల సంఖ్య పెంచాలి..

28-01-2025 11:26:39 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): దేశంలో ప్రయాద్ రాజ్‌లో జరుగుతున్నటువంటి త్రివేణి సంఘమంలో 144 సంవత్సరాల తరువాత వచ్చిన మహ కుంభమేళలో దేశ విదేశాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి కోరారు. మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని, మహాకుంభమేళాకు హాజరైయ్యేందుకు దాదాపు వారం రోజులు పడుతుంది కాబట్టి భక్తులకు రవాణా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో విమాణాల సర్వీస్‌ల షెటిల్స్‌ను పెంచి టికెట్ రేట్లను తగ్గించినట్లుతై భక్తులు త్రివేణీ సంఘమంలో స్నానాలు ఆచరించడం పునీతులవుతారని తెలిపారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక భక్తులు ఈ మహాకుంభ మేళాలో హాజరవుతారని, వారి సౌకర్యార్ధం అన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రైళ్లు, బస్సుల్లో పోవాలంటే వారం రోజులు పడుతుందని, భక్తుల సౌకర్యార్ధం విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర విమానయాణ శాఖమంత్రి రామ్మెహన్ రావు ఆయన విజప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అనంతసేన్, తిరుమల్ సేన్, శంకర్ రావు, డి. రాంరెడ్డి, భాస్కర్, సముద్రాల రమేష్, రాంచందర్ రావు, సంగమేశ్వర్ రెడ్డి, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులు, భారత దేశ భక్తులు దాదాపు 50 వేల భక్తులు మహాకుంభ మేళాకు వెళ్లే అవకాశం ఉందని, వారికి సౌకర్యార్థం విమాణాల సర్వీస్ షెటిళ్లను పెంచాలని కోరారు.